టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్‌ శర్మ.. | Rohit Sharma creates Record in T20s | Sakshi
Sakshi News home page

Rohit Sharma: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్‌ శర్మ..

Published Sat, Nov 20 2021 9:29 AM | Last Updated on Sat, Nov 20 2021 2:53 PM

Rohit Sharma creates Record in T20s - Sakshi

Rohit Sharma creates Record in T20s: టి20 క్రికెట్‌లో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50కుపైగా పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి రికార్డును రోహిత్‌ సమం చేశాడు. రాంచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో 55 పరుగులు చేసిన  హిట్‌మ్యాన్‌ ఈ ఘనత అందుకున్నాడు. రోహిత్‌ 118 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును సాధించగా, కోహ్లి 95 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. రెండో స్ధానంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం ఉన్నాడు.

కాగా టీ20ల్లో రోహిత్‌ 4 సెంచరీలు నమోదు చేయగా, కోహ్లి ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై భారత్‌ 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది.

చదవండి: IND Vs NZ 2nd T20 : రోహిత్‌ శర్మ పాదాలపై పడిన అభిమాని.. చివరకు ఏం జరిగిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement