సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ షాకిచ్చింది. వరుసగా 18 సిరీస్‌ల విజయాలతో దూసుకెళుతున్న రోహిత్ సేన దూకుడుకు కివీస్ బ్రేక్‌లు వేసింది. 12 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్ టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.
పుణే వేదికగా జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత జట్టు.. ఈ పరాభావన్ని మూటకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌కు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అవి ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
ఓటమిపై మీ స్పందన ఏంటి?
ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం నన్ను బాధించింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలయ్యాము. కానీ ఈ ఓటమిపై మరీ ఎక్కువగా పోస్టుమార్టం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఇదే బ్యాటర్లు మాకు ఎన్నో సిరీస్‌లలో విజయాలను అందించారు. ఇటువంటి సమయంలోనే కాస్త భిన్నంగా ఏమి చేయగలమో ఆలోచించాలి. కచ్చితంగా తదుపరి మ్యాచ్‌లో మేము పుంజుకుంటామన్న నమ్మకం ఉంది. అదేవిధంగా న్యూజిలాండ్ మాకంటే బాగా ఆడింది. వారు ఈ విజయానికి అర్హులు అని రోహిత్ బదులిచ్చాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుపై మీ అభిప్రాయం?
డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత మ్యాచ్‌లో ఓటమిపై నేను ఆలోచిస్తున్నాను. నిజంగా ఈ ఓటమి నన్ను తీవ్ర నిరాశపరిచింది. మేము సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయామనేది వాస్తవం. ఒక మ్యాచ్‌లో గెలిస్తే ఆ క్రెడిట్ టీమ్ మొత్తానికి దక్కుతుంది.
అదే ఓడిపోయినప్పుడు కూడా ఆ బాధ్యతను జట్టు మొత్తం తీసుకోవాలి. సమిష్టి వైఫల్యం కారణంగానే మేము ఓటమి ఓడిపోయాం. అంతే తప్ప కేవలం ఒకరిద్దరిపైనే నెపం నెట్టడం సరికాదు. మేము ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాం. మాకు ఆ సిరీస్ కీలకం కానుంది. తొలిసారి ఆసీస్‌తో టెస్టులు ఆడనున్న ఆటగాళ్లకు నేను అన్ని విధాలగా సపోర్ట్‌గా ఉంటాను. అక్కడ గెలవడమే మా లక్ష్యమని రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే
Comments
Please login to add a commentAdd a comment