Rohit joins Tendulkar, Kohli in elite list with a knock against Australia - Sakshi
Sakshi News home page

IND vs AUS: మ్యాచ్‌ ఓడిపోయినా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

Published Thu, Mar 23 2023 12:37 PM | Last Updated on Thu, Mar 23 2023 12:44 PM

Rohit Sharma enters elite list topped by Sachin Tendulkar - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత  సాధించాడు. ఆసియాలో 10000 కంటే ఎక్కువ పరుగులు చేసిన 8వ భారత బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 30 పరుగులు చేసిన రోహిత్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

రోహిత్‌ ఇప్పటివరకు ఆసియాలో 10026 పరుగులు చేశాడు. ఇక ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 21741 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతిలో స్థానంలో శ్రీలంక గ్రేట్‌ కుమార సంగక్కర(18423) ఉన్నాడు.

ఈ అరుదైన ఘనత సాధించిన బ్యాటర్లు వీరే
1.సచిన్ టెండూల్కర్( 21741 పరుగులు)
2.కుమార సంగక్కర(18423 పరుగులు)
3.విరాట్ కోహ్లీ (14694 పరుగులు)
4.సనత్ జయసూర్య (13757 పరుగులు)
5.రాహుల్ ద్రవిడ్ (13497 పరుగులు)
6.వీరేంద్ర సెహ్వాగ్ (12155 పరుగులు)
7.యూనిస్ ఖాన్ (12073 పరుగులు)
8.ఇంజమామ్-ఉల్-హక్ (12070 పరుగులు)
9.దిల్షాన్ (11567 పరుగులు)
10.ఎంఎస్ ధోని (10840 పరుగులు)
11.సౌరవ్ గంగూలీ (10709 పరుగులు)
12.అరవింద డి సిల్వా (10589 పరుగులు)
13.మహ్మద్ అజారుద్దీన్ (10558 పరుగులు)
14.మహ్మద్‌ యూసఫ్‌(10059 పరుగులు)
15. రోహిత్‌ శర్మ(10026 పరుగులు)


ఇక మూడో వన్డే విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 21 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత్‌ కోల్పోయింది.
చదవండి: IND vs AUS: పరువు పోగొట్టుకున్న స్మిత్.. నవ్వుకున్న విరాట్‌ కోహ్లి!వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement