
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం(మార్చి 2) దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టేబుల్ టాపర్‌గా లీగ్ స్టేజిని ముగించాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గుడ్ న్యూస్ అందింది.
తొడ కండరాల గాయంతో బాధపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఈ గాయం కారణంగా రెండు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్న రోహిత్.. తిరిగి మళ్లీ నెట్స్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం దాదాపు 95 నిమిషాల పాటు రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ ధ్రువీకరించాడు.
"రోహిత్ శర్మ గాయంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. నెట్స్‌లో చాలా సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో కూడా అతడు భాగమయ్యాడు. అతడికి ఈ గాయాన్ని ఎలా మెనెజ్ చేయాలో బాగా తెలుసు" అని ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో టెన్ డెష్కాట్ పేర్కొన్నాడు.
మరోవైపు జ్వరం బారిన పడిన ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా కివీస్‌తో మ్యాచ్‌కు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు శనివారం తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోనుంది. కాగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ కోసం భారత తుది జట్టులో ఎటువంటి మార్పులు చోటుచేసుకోపోవచ్చు.
తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌కు కొనసాగించే అవకాశముంది. దీంతో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.
చదవండి: Champions Trophy: సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment