వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి జట్టుకు హిట్‌మ్యాన్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై రోహిత్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
ముఖ్యంగా కివీస్ ఫ్రంట్ లైన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌ను రోహిత్ టార్గెట్ చేసి ఒత్తిడిలోకి నెట్టాడు. మూడో ఓవర్ వేసిన బౌల్ట్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా భారీ సిక్సర్ కొట్టిన హిట్‌మ్యాన్.. కివీస్ ఆటగాళ్లను సైతం ఆశ్చర్యపరిచాడు. రోహిత్ క్రీజులో ఉన్నంత సేపు స్టేడియం దద్దరిల్లిపోయింది.
ఇక భారత ఇన్నింగ్స్ 8 ఓవర్ వేసిన టిమ్ సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలయన్‌కు చేరాడు. తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ రికార్డులకెక్కాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు రోహిత్ శర్మ 27 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ స్టార్ క్రిస్‌గేల్(26)ను అధిగమించాడు. 2015 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో గేల్ 26 సిక్సర్లు బాదాడు.
చదవండి: CWC 2023 Ind vs NZ: న్యూజిలాండ్‌తో సెమీస్.. పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 84/1
Comments
Please login to add a commentAdd a comment