ఐపీఎల్-2023లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 126.89 స్ట్రైక్ రేట్‌తో కేవలం 184 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా గత రెండు మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్‌లు అయిన ఆటగాడిగా రోహిత్ చెత్త రికార్డు నెలకొల్పాడు.
ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రోహిత్ 16 సార్లు డకౌటయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫామ్‌ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వాఖ్యలు చేశాడు. రోహిత్ బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎటువంటి సమస్య లేదని, అతడు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
"రోహిత్ శర్మ మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు. రోహిత్ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. అతడిలో కాస్త గందరగోళం నెలకొంది. బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొలేకపోతున్నాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌తో ఎటువంటి సమస్య లేదు. అయితే హిట్‌మ్యాన్‌కు ఒక్క ఇన్నింగ్స్ చాలు, ఫామ్‌లోకి వస్తే ఆపడం ఎవరూ తరం కాదు అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌లో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం! జోర్డాన్ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment