2023 ఏడాదిని భారత క్రికెట్ జట్టు ఓటమితో ముగిచింది. సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను గెలవాలనకున్న టీమిండియాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక ఈ బ్యాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ అదరగొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ పేసర్ల దాటికి భారత్ కేవలం 131 పరుగులకే కుప్పకూలింది.
రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి(76) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నండ్రే బర్గర్ 4 వికెట్లతో చెలరేగగా.. జానెసన్ 3, రబాడ రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేసింది. ప్రోటీస్ ఓపెనర్ డీన్ ఎల్గర్(185) అద్బుత సెంచరీతో మెరిశాడు. ఇక బాక్సింగ్ డే టెస్టులో అద్భుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్ తర్వాత సౌతాఫ్రికా కొంచెం ఒత్తిడిలోకి వెళ్తుందని నేను భావించాను. కానీ వారి పేస్ అటాక్ అంచనాలను మించిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రోటీస్ పేసర్లు సంచలన ప్రదర్శన చేశారు. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది.
కానీ భారత బ్యాటర్లు తమ చెత్త షాట్ సెలక్షన్ వల్ల వికెట్లను కోల్పోయారు. పరిస్థితులను అర్దం చేసుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్ మొత్తంలో ఎల్గర్, జాన్సెన్, బెడింగ్‌హామ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ మాత్రమే బ్యాట్‌తో రాణించగల్గారు. పరిస్థితులను అర్దం చేసుకుని సరైన టెక్నిక్‌తో బ్యాటింగ్ చేశారు" సచిన్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు.
చదవండి: IND vs SA: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్ షాక్..
Comments
Please login to add a commentAdd a comment