సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. మొత్తం మూడు టెస్టుల్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచి కివీస్ ముందు టీమిండిచా మోకరిల్లింది. 92 ఏళ్ల ఇండియన్ క్రికెట్‌లో సొంతగడ్డపై రెండు కంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో తొలిసారి వైట్‌వాష్‌కు గురై ఘోర అవమానాన్ని రోహిత్ సేన ఎదుర్కొంది.
ఈ సిరీస్ అసాంతం భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకిల పడింది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను టీమిండియా సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ ఘోర పరభావంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఈ ఓటమితో భారత జట్టు కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలని సచిన్ అభిప్రాయపడ్డాడు.
"స్వదేశంలో 3-0 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం మింగుడు పడని విషయం. కచ్చితంగా టీమిండియా ఈ ఓటుములపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఘోర పరభావానికి ప్రిపరేషన్ లోపమా, పేలవమైన షాట్ ఎంపికనా, లేక మ్యాచ్ ప్రాక్టీస్ లోపమా? కచ్చితంగా తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి.
శుబ్‌మన్ గిల్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సత్తాచాటాడు. ఈ సిరీస్‌లో అతడు పూర్తిగా భిన్నంగా కన్పించాడు. పంత్ ఫుట్‌వర్క్ చాలా బాగుంది. అతడి బ్యాటింగ్‌ను చూస్తే వేరే పిచ్‌పై ఆడినట్లు అన్పించింది. పంత్ సింప్లీ సూపర్బ్ అంటూ" ఎక్స్‌లో లిటల్ మాస్టర్ రాసుకొచ్చాడు.
చదవండి: Wriddhiman Saha Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment