Photo Credit: Hundred Twitter
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్-2026లో ట్రెంట్ రాకెట్స్ ఐదో విజయాన్ని అందుకొని టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ విధ్వంసానికి తోడు ఓపెనర్లు రాణించడంతో 7 వికెట్ల తేడాతో బర్మింగ్‌హమ్ ఫోనిక్స్‌పై గెలుపొందింది. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్ 83 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది.
సామ్ బిలింగ్స్ (19 బంతుల్లో 31 నాటౌట్, 1 ఫోర్, మూడు సిక్సర్లు) అజేయం కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించగా, ఓపెనర్లు బెన్ డకెట్ (22), ఫిన్ అలెన్ (28) రాణించారు. బర్మింగ్‌హమ్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ 2 వికెట్లు తీయగా, బెన్‌డార్ఫుసిస్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హమ్ ఫొనిక్స్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. జో క్లార్క్ (45 బంతుల్లో 62) అర్ధసెంచరీ మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. లారి ఎవన్స్ (19) పర్వాలేదనిపించాడు.
ట్రెంట్ బౌలర్లలో లూయిస్ గ్రెగొరి 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ ఆమిర్, మాట్ హెన్రీ,మిచెల్ సాంట్నర్ తలా ఒక వికెట్ తీశారు. ఆరు మ్యాచ్‌ల్లో ఐదో విజయంతో ట్రెంట్ రాకెట్స్ 20 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉండగా, బర్మింగ్‌హమ్ ఫొనిక్స్ నాలుగో పరాజయంతో పట్టికలో అట్టడుగున నిలిచింది.
🚨 Crowd catch!
Sam Billings smashes it into the crowd, and the safe hands of this fan 🙌#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/8MTtMl4pbT— The Hundred (@thehundred) August 5, 2026
Sam Billings Is A Very Clean Hitter. Great Technique pic.twitter.com/7nZ2qPFP2m
— Aryan Goel 2.0 (@AryanGoelNew) August 5, 2026


