Sanju Samson Can Become India Captain One Day, Says AB De Villiers - Sakshi
Sakshi News home page

గిల్‌, రాహుల్‌ కాదు.. అతడే టీమిండియా కెప్టెన్‌ అవుతాడు! జట్టులో ప్లేసే దిక్కు లేదు

Published Fri, Apr 7 2023 2:00 PM | Last Updated on Fri, Apr 7 2023 2:27 PM

Sanju Samson can become India captain one day says AB de Villiers  - Sakshi

PC: IPL.COM

ఐపీఎల్‌-2023లో టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అదరగొడుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో చెలరేగిన సంజూ.. బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగులతో రాణించాడు. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శాంసన్‌కు భారత జట్టులో తగినన్ని అవకాశాలు ఇవ్వాలని మరోసారి పెద్దు ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో దుమ్ము రేపుతున్న శాంసన్‌.. తన బ్యాటింగ్‌, కెప్టెన్సీ స్కిల్స్‌తో దక్షిణాఫ్రికా లెజెండ్‌ డివిలియర్స్‌ను అకట్టుకున్నాడు. ఏదో ఒక రోజున భారత జట్టుకు సంజూ కచ్చితంగా నాయకత్వం వహిస్తాడని డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సంజూ చాలా కూల్‌గా ఉంటాడని ఏబీడీ కొనియాడాడు. 

"సంజు శాంసన్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడి కెప్టెన్సీ కూడా చాలా బాగుంది. అతడు ఫీల్డ్‌లో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అటువంటి కెప్టెన్‌లు చాలా అరుదుగా ఉంటారు. ఒక నాయకుడిగా వ్యుహాలు రచించడంలో కూడా అతడు ముందంజలో ఉంటాడు. జోస్ బట్లర్ వంటి వరల్డ్‌ క్లాస్‌ క్రికెటర్లతో డ్రెస్సింగ్‌ రూంను షేర్‌ చేసుకోవడంతో సంజూ ఇంకా మెరుగుపడతాడని నేను భావిస్తున్నాను.

బట్లర్‌ వంటి కెప్టెన్‌, ఆటగాడు సంజూకు  దొరకడం అతడి అదృష్టం. బట్లర్‌ నుంచి అతడు చాలా విషయాలు నేర్చుకుంటాడు. శాంసన్ రాబోయే రోజుల్లో కచ్చితంగా ఏదో ఒక ఫార్మాట్‌లో టీమిండియాకు నాయకత్వం వహిస్తాడు. అతడికి భారత జట్టును నడిపించడానికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి.

సంజూకు రెగ్యూలర్‌గా ఛాన్స్‌లు ఇస్తే క్రికెట్‌ ప్రపంచాన్నే జయిస్తాడు" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్‌ పేర్కొన్నాడు. కాగా భారత జట్టులో శుబ్‌మన్‌ గిల్‌, పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి ఫ్యూచర్‌ స్టార్లు ఉన్నప్పటికీ.. శాంసన్ కెప్టెన్‌ అవుతాడని ఏబీడీ జోస్యం చెప్పడం అందరనీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం జట్టులో సంజూకు చోటు దక్కడమే చాలా కష్టంగా మారింది. అటువంటిది టీమిండియా కెప్టెన్‌ అంటే కష్టమనే చెప్పుకోవాలి.
చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్‌! ప్రతీసారి ఇంతే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement