చరిత్ర సృష్టించిన శాంసన్‌.. ధోని కూడా సాధ్యం కాలేదు | Sanju Samson Creates History for CSK, Achieves Record MS Dhoni Never Managed | Sakshi
Sakshi News home page

Sanju Samson: చరిత్ర సృష్టించిన శాంసన్‌.. ధోని కూడా సాధ్యం కాలేదు

Apr 12 2026 6:30 AM | Updated on Apr 12 2026 7:28 AM

Sanju Samson Creates History for CSK, Achieves Record MS Dhoni Never Managed

ఐపీఎల్‌-2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.

తొలి మూడు మ్యాచ్‌లలో విఫలమైన సంజూ.. ఢిల్లీపై మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. శాంసన్‌ కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సెంచరీ బాదిన మొట్టమొదటి వికెట్ కీపర్-బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

2008 నుండి సీఎస్‌కే పూర్తిస్థాయి కీపర్‌గా ఉన్న ఎంఎస్ ధోనికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోనీ అత్యధిక స్కోరు 84 పరుగులుగా ఉంది. అయితే ధోని దాదాపుగా లోయార్డర్‌లోనే బ్యాటింగ్‌కు రావడంతో ఒక్కసారి మూడంకెల స్కోర్‌ను అందుకోలేకపోయాడు. కానీ సంజూ మాత్రం సీఎస్‌కే తరపున తొలి ఎడిషన్‌లో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు.
చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement