టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను గత కొన్ని నెలలగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోపోయిన శాంసన్‌ను.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు కూడా భారత సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.
ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లు గైర్హజరీలో కూడా శాంసన్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. శాంసన్ చివరగా ఈ ఏడాది ఆగస్టులో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున ఆడాడు. శాంసన్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2023లో కేరళ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ 'ఐ యామ్ విత్ ధన్య వర్మ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్శను ఉద్దేశించి శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ఎల్లప్పుడూ తనకు సపోర్ట్‌గా ఉంటాడని శాంసన్ చెప్పుకొచ్చాడు.
"రోహిత్ భాయ్ నుంచి నాకు ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. అతడు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నా దగ్గరకు వచ్చి అప్యాయంగా వచ్చి మాట్లాడే వ్యక్తుల్లో రోహిత్ మొదటి స్ధానంలో ఉంటాడు. ఓసారి రోహిత్ నా దగ్గరకు వచ్చి 'హే సంజు.. ఏంటి సంగతి? నీవు ఐపీఎల్‌లో బాగా ఆడుతున్నావు. నీ బ్యాటింగ్ స్టైల్ కూడా బాగుంటుంది. కానీ ముంబై ఇండియన్స్‌పై ఎక్కువ సిక్సర్లు కొట్టావు అని నవ్వుతూ రోహిత్ అన్నాడు" అని సంజూ పేర్కొన్నాడు.
చదవండి: యువరాణి.. 225 ఎకరాల ఎస్టేట్.. 6 ఎకరాల్లో ప్యాలెస్.. భారత క్రికెటర్‌గా! జడేజాకు చుట్టమా?
Comments
Please login to add a commentAdd a comment