పూణే వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటకి ఆ జట్టు పేసర్ సకీబ్ మహమూద్ మాత్రం నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత టాప్ ఆర్డర్‌ను కుప్ప కూల్చాడు.
రెండో ఓవర్ వేసిన మహమూద్.. తొలి బంతికే సంజు శాంసన్ (1) వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మను గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్‌లో చివరి బంతికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను సకీబ్ బోల్తా కొట్టించాడు.
ఆ ఓవర్‌ను మూడు వికెట్లతో పాటు మెయిడిన్‌గా సకీబ్ ముగించాడు. ఈ క్రమంలో మహమూద్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
సకీబ్ సాధించిన రికార్డులు ఇవే..
👉టీ20ల్లో భారత్‌పై ట్రిపుల్ వికెట్ మెయిడెన్ తొలి బౌలర్‌గా సకీబ్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్‌గా కూడా ఈ ఘనత సాధించలేదు. అంతేకాకుండా ఈ ఫీట్ సాధించిన తొలి ఇంగ్లీష్ బౌలర్ కూడా సకీబ్ కావడం గమనార్హం. ఇంతవరకు ఏ ఇంగ్లీష్ బౌలర్ కూడా ఇతర జట్లపై కూడా ఈ ఫీట్ సాధించలేదు.
👉అదేవిధంగా ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ట్రిపుల్ వికెట్ మెయిడెన్ బౌలింగ్ చేసిన బౌలర్‌గా వెస్టిండీస్ మాజీ పేసర్ జెరోమ్ టేలర్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. 2007లో గ్కెబెర్హాలో దక్షిణాఫ్రికాపై రెండో ఓవర్‌లోనే జెరోమ్ టేలర్ ఈ ఫీట్ సాధించాడు.
రాణించిన దూబే, హార్దిక్..
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో మహమూద్‌తో పాటు ఓవర్టన్ రెండు,రషీద్, కార్స్ తలా వికెట్ సాధించారు. ఇంగ్లండ్ 166 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన హర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు సాధించారు.. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.
చదవండి: అతడిని ఆడించడం అన్యాయం.. మాకు ఒక మాట కూడా చెప్పలేదు: బట్లర్
Comments
Please login to add a commentAdd a comment