ODI series loss really hurts but we won't point fingers at individuals: Rohit Sharma - Sakshi
Sakshi News home page

IND vs AUS: అదే మా కొంప ముంచింది.. అస్సలు ఊహించలేదు! క్రెడిట్‌ మొత్తం వారికే

Published Thu, Mar 23 2023 7:54 AM | Last Updated on Thu, Mar 23 2023 8:44 AM

series loss really hurts,we wont point fingers at individuals says Rohit - Sakshi

చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత్‌ కోల్పోయింది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమిండియా... టాపార్డర్ బ్యాటర్లు రాణించినా మిడిల్ ఆర్డర్‌లో సరైన భాగస్వామ్యం నమోదు కాకపోవడంతో 49.1 ఓవర్లలో 248 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌  సూర్యకుమార్‌ యాదవ్‌ గోల్డన్‌డక్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47), అలెక్స్ క్యారీ(46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక ఈ మ్యాచ్‌ అనంతరం తమ ఓటమిపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఈ ఓటమి తమను చాలా బాధించిందని, తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుంటామని రోహిత్‌ తెలిపాడు.

"ఇదేమి పెద్ద లక్ష్యం కాదు. ఈ మ్యాచ్‌లో మేము బాగా బ్యాటింగ్‌ చేయలేదు. అందుకే ఓడిపోయాం. మ్యాచ్‌ గెలవాలంటే భాగస్వామ్యాలు చాలా ముఖ్యమైనవి . ఈ మ్యాచ్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. ఈ తరహా వికెట్లపై ఆడుతూ వచ్చిన మేము, బ్యాటింగ్‌లో ఇలా విఫలమవుతాము అని అస్సలు ఊహించలేదు. అద్భుతమైన ఆరంభం వచ్చాక.. ఒక బ్యాటర్ క్రీజులో నిలబడి వీలైనంత వరకు మ్యాచ్‌ను విజయం దిశగా తీసుకెళ్లడం చాలా ముఖ్యం.

ఈ మ్యాచ్‌లో అది జరగలేదు. ఇది మాకు ఒక గుణపాఠం. ఈ ఏడాది ఇప్పటివరకు మేము ఆడిన తొమ్మిది వన్డేల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. వాటిలో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌ ఓటమి మాకు చాలా విషయాలు నేర్పించింది. ఈ ఓటమితో మేం ఏ విభాగాల్లో మెరుగుపడాలో అనే విషయం తెలిసింది.

ఈ ఓటమికి ఒకరిద్దరిని బాధ్యలు చేయాలి అని నేను అనుకోవడం లేదు. ఇది సమష్టి వైఫల్యం. ఇక ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ ఆసాంతం ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడింది. కాబట్టి క్రెడిట్‌ వారికే ఇవ్వాలి. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్‌ చేసి మాపై ఒత్తడి పెంచారు. అదే విధంగా వారి పేసర్లు కూడా కీలక సమయాల్లో వికెట్లు సాధించారు" అని రోహిత్‌ పేర్కొన్నాడు.
చదవండి: IND VS AUS 3rd ODI: వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గోల్డన్‌ డకౌట్‌ అయిన సూర్యకుమార్‌.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement