జపాన్‌ చేరుకున్న టీమిండియా.. శ్రేయస్‌ వ్యాఖ్యలు వైరల్‌! | Shreyas-Iyer-Response-Viral-Team India Lands In Japan-Play-Historic T20I Match | Sakshi
Sakshi News home page

జపాన్‌ చేరుకున్న టీమిండియా.. శ్రేయస్‌ వ్యాఖ్యలు వైరల్‌!

Sep 21 2026 3:57 PM | Updated on Sep 21 2026 4:50 PM

Shreyas-Iyer-Response-Viral-Team India Lands In Japan-Play-Historic T20I Match

Photo Credit: BCCI Twitter

జపాన్‌తో చారిత్రాత్మక టీ20 మ్యాచ్ ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా వారి గడ్డపై అడుగుపెట్టింది. జపాన్‌కు చేరుకున్న భారత బృందానికి ఘన స్వాగతం లభించింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రత్యేక వీడియోనూ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో శ్రేయస్ అయ్యర్ జపాన్ ఆతిథ్యంపై ప్రశంసల వర్షం కురిపించాడు. 

జపాన్ ప్రభుత్వం నుంచి తమకు అద్భుత స్వాగతం లభించిందని, చూడడానికి చాలా అందంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. జపాన్‌లో క్రికెట్ పరిస్థితులపై శ్రేయస్‌ మాట్లాడుతూ.. ‘ఇది మాకు చాలా ఉత్కంఠభరితమైన, ఉత్తేజకరమైన మ్యాచ్ కాబోతోంది. మేము జపాన్‌తో ఆడడం ఇదే తొలిసారి కాబట్టి, ఇక్కడి పిచ్ పరిస్థితి, వికెట్ గురించి పెద్దగా తెలియదు. కానీ జపాన్‌తో ఒక గొప్ప మ్యాచ్ ఆడేందుకు మాత్రం ఎదురుచూస్తున్నాం.’ అని ముగించాడు.

ఇటీవలే ఢిల్లీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శ్రేయస్ వరుసగా 8 నాటౌట్‌, 11, 29 పరుగులు సాధించాడు. ఆసియా గేమ్స్‌లో భాగంగా సెప్టెంబర్ 28న టీమిండియా క్వార్టర్ ఫైనల్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఫామ్‌లోకి రావాలని శ్రేయస్ ఉవ్విళ్లూ రుతున్నాడు. మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన శ్రేయస్ ప్రస్తుతం టీమిండియాకు టీ20 కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా 13 ఇన్నింగ్స్‌ల్లో 143 స్ట్రైక్‌రేట్‌తో 359 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి.

సుజుకి కప్‌గా నామకరణం
భారత్‌- జపాన్‌ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఇరుదేశాల పురుష క్రికెట్‌ జట్ల మధ్య ఈ మేరకు ఏకైక టీ20 మ్యాచ్‌ నిర్వహణకు సన్నాహకాలు చేశారు. ‘స్పోర్ట్‌-75’ పేరుతో రూపొందుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాల మధ్య క్రీడల అభివృద్ధికి సహకారాన్ని ఆశిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

రెండు జట్ల మధ్య జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్‌కు సుజుకి కప్ అని నామకరణం చేశారు. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు టోచిగి ప్రిఫెక్చర్‌లోని సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమాన ప్రకారం రేపు ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

జపాన్ టీ20, ఆసియా క్రీడలకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌, రవి బిష్ణోయి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, వైభవ్ సూర్యవంశీ, యష్ ఠాకూర్, విప్రజ్ నిగమ్.

ఇదీ చదవండి: జ‌పాన్‌ను చిత్తుగా ఓడించిన భార‌త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement