టీమిండియా రైజింగ్ స్టార్ శుభ్‌మన్ గిల్‌కు సంబంధించిన ఓ పాత పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. గిల్ గతేడాది (2022) డిసెంబర్ 31న తన తదుపరి ఏడాది లక్ష్యాలను పేపర్‌పై రాసుకుని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.
సరిగ్గా ఏడాది తర్వాత గిల్ పెట్టుకున్న లక్ష్యాలను పరిశీలిస్తే.. వాటిలో ఒక్కటి మినహా అన్నింటినీ అధిగమించాడు. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవడం మినహా గిల్ ఈ ఏడాదికి పెట్టుకున్న లక్ష్యాలన్నీ నెరవేరడంతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Shubman Gill exactly a year ago created a bucket list for 2023.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2023
- He achieved almost everything, but the World Cup...!!! 💔 pic.twitter.com/OhS8s1UASU
గిల్ ఈ ఏడాదికి పెట్టుకున్న మిగతా లక్ష్యాలు ఏవంటే..
- భారత్ తరఫున అత్యధిక సెంచరీలు
- కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం
- అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తనవంతు కృషి చేయడం
- ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలవడం
- ప్రపంచకప్ గెలవడం
గిల్ ఈ ఏడాదికి తాను నిర్ధేశించుకున్న ఐదు లక్ష్యాలలో వరల్డ్‌కప్ గెలవడం మినహా అన్ని సాధించాడు. గిల్ పేపర్‌పై రాసుకున్న ఈ బకెట్ లిస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. గిల్ ఈ ఏడాది కూడా మరిన్ని లక్ష్యాలు పెట్టుకుని వాటిని సైతం సాధించాలని అతని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
కాగా, గిల్ ఈ ఏడాది ఐపీఎల్ (3) సహా అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లు (7) కలుపుకుని మొత్తం 10 సెంచరీలు సాధించాడు. ఈ ఏడాది భారత్ తరఫున గిల్‌దే అత్యధిక సెంచరీల రికార్డు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (అంతర్జాతీయ క్రికెట్‌లో 8, ఐపీఎల్‌లో 2) కూడా గిల్‌తో సమానంగా ఈ ఏడాది 10 సెంచరీలు బాదాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 3 సెంచరీలు, 4 అర్ధసెంచరీల సాయంతో 890 పరుగులు చేసి ఈ ఏడాది ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా (అత్యధిక పరుగులు) నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment