
టీమిండియా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన గిల్.. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లోనూ సత్తాచాటాడు. 52 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు.
గిల్ క్రీజులో ఉన్నంతసేపు తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్లు సంజయ్ బంగర్, నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రశంసల వర్షం కురిపించారు. రాబోయే రోజుల్లో భారత జట్టు బ్యాటింగ్ ఎటాక్‌ను గిల్ లీడ్ చేస్తాడని వారిద్దరూ కొనియాడారు.
"శుబ్‌మన్ గిల్ ఒక అద్బుతం. తన కెరీర్ ఆరంభం నుంచే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన రెండున్నర ఏళ్ల వన్డే క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలు రాయిలను సాధించాడు. ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంది.
స్ట్రెయిట్ డ్రైవ్, ఆన్-డ్రైవ్ షాట్లను అద్బుతంగా ఆడుతున్నాడు. మిడ్-ఆఫ్, మిడ్ ఆన్ ఫీల్డర్లు 30 యార్డ్ సర్కిల్ ఉన్నప్పటికి వారి మధ్య నుంచి బంతిని బౌండరీకు తరలిస్తున్నాడు. అతడు కచ్చితంగా రాబోయే రోజుల్లో భారత బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నముకగా నిలుస్తాడని" బంగర్ జియో హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
గిల్ షాట్ ఆడే టైమింగ్ అద్బుతంగా ఉంది. భారత జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ మర్రిచెట్టు లాంటి వాళ్లు. సాధరణంగా మర్రి చెట్టు కింద ఎటువంటి మెక్కలు పెరగవు. కానీ గిల్ మాత్రం.. రోహిత్, విరాట్ వంటి మర్రిచెట్టు నీడల్లోంచి గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కొట్టిన రెండు స్ట్రెయిట్ డ్రైవ్‌లు, కవర్ డ్రైవ్ షాట్లను చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. ఆ షాట్లు చూసి ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు సైతం షాక్ అయిపోయారు" అని సిద్దూ చెప్పుకొచ్చాడు.
చదవండి: చాలా అలసిపోయాను.. అది నా బలహీనత.. కానీ అదే బలం: కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment