ఐపీఎల్ 2023లో ఏకంగా 3 సెంచరీలు బాది, పర్ఫెక్ట్ టీ20 ప్లేయర్‌గా వేనోళ్ల పొగడ్తలు అందుకున్న టీమిండియా యువ ఓపెనర్ శభ్‌మన్ గిల్‌పై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. పట్టుమని 10 టీ20లు కూడా ఆడక ముందే గిల్‌ను కొందరు టార్గెట్ చేస్తున్నారు. గిల్ అసలు టీ20లకే పనికిరాడంటూ ప్రచారం చేస్తున్నారు. విండీస్‌తో తొలి టీ20లో (9 బంతుల్లో 3) దారుణంగా విఫలమైన అనంతరం గిల్ విమర్శకులు స్వరం మరింత పెంచారు. గిల్‌ను టీ20 జట్టు నుంచి తప్పించి యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇప్పటివరకు 7 టీ20లు ఆడిన గిల్ న్యూజిలాండ్‌పై సెంచరీ మినహా అస్సలు రాణించింది లేదని గణాంకాలు ప్రూఫ్స్‌గా చూపిస్తూ విమర్శిస్తున్నారు. గిల్ ప్లేయింగ్ స్టయిల్ పొట్టి ఫార్మాట్‌కు సెట్ అయ్యేలా లేదని, అతను కేవలం ఐపీఎల్ ప్లేయర్ మాత్రమే అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు గిల్‌పై వస్తున్న ఈ విమర్శలను చాలామంది కొట్టి పారేస్తున్నారు. కేవలం 7 మ్యాచ్‌లకే ఓ ప్లేయర్ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారని మండిపడుతున్నారు. అతి తక్కువ కెరీర్ స్పాన్‌లో గిల్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తు చేస్తున్నారు.
ఆటపై అవగాహన లేని వాళ్లే గిల్‌ను విమర్శిస్తారని చురకలంటిస్తున్నారు. కాగా, 23 ఏళ్ల గిల్ ఇప్పటివరకు 18 టెస్ట్‌లు, 27 వన్డేలు, 7 టీ20లు ఆడి 7 సెంచరీలు, 10 అర్ధసెంచరీల సాయంతో 2600కు పైగా పరుగులు చేశాడు. అలాగే ఐపీఎల్‌లో 91 మ్యాచ్‌లు ఆడి 3 సెంచరీలు, 18 అర్ధసెంచరీల సాయంతో 2790 పరుగులు చేశాడు. గిల్ ఐపీఎల్ కెరీర్‌లో చేసిన 3 సెంచరీలు గత సీజన్‌లో చేసినవే కావడం విశేషం.
ఇదిలా ఉంటే, విండీస్‌తో నిన్న (ఆగస్ట్ 3)జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన భారత్ 145 పరుగులకే పరిమితమైంది. అరంగేట్రం ఆటగాడు తిలక్ వర్మ (39) మినహా టీమిండియా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రెండో టీ20 ఆగస్ట్ 6న గయానాలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment