
ఇంగ్లండ్-భారత మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి హెడ్డింగ్లీ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్‌కు పయనమైంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. జట్టు తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు 14 రోజుల ముందే అక్కడకు గిల్ సేన చేరుకోనుంది.

జూన్ 13 నుంచి 16 వరకు బెకెన్‌హామ్ వేదికగా ఇండియా-ఎతో సీనియర్ భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ప్రధాన సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇంగ్లండ్‌కు పయనమవ్వకముందు కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్, గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు.
ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు వీరిద్దరూ సమాధనమిచ్చారు. ఈ సిరీస్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు. అదేవిధంగా భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇంకా ఖారారు చేయలేదని, తమకు ఇంకా రెండు వారాల సమయం ఉందని గిల్ పేర్కొన్నాడు.
కాగా ఈ సిరీస్‌కు ముందు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి స్ధానాలను ఎవరు భర్తీ చేస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లి స్ధానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్‌కు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనాధికారిక టెస్టు సిరీస్‌లో దుమ్ములేపుతున్నాడు.
తొలి అనాధికారిక టెస్టులో నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు సాయిసుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్