న్యూజిలాండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అందింది. గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్ ఆడటం అనుమానంగా మారింది. గిల్‌కు మెడ పట్టేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి కామెంట్లు చేయలేదు. గిల్ విషయంలో భారత్ మేనేజ్‌మెంట్ చివరి నిమిషం వరకు వేచి చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
మ్యాచ్ సమయానికి గిల్ పూర్తిగా కోలుకోకపోతే సర్ఫరాజ్ ఖాన్ అతని స్థానాన్ని భర్తీ చేయవచ్చు. సర్ఫరాజ్ ఇటీవల జరిగిన ఇరానీ కప్‌లో మ్యాచ్ విన్నింగ్ డబుల్ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌కు (భారత్, న్యూజిలాండ్) వరుణ గండం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బెంగళూరులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దైంది.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో.. మూడో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్నాయి.
న్యూజిలాండ్‌తో టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
భారత్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ టీమ్
డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్‌మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.
చదవండి: షమీ ఫిట్‌గా ఉన్నా.. ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment