
ప్రపంచ నంబర్‌వన్ టి20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగేందుకు ఇంకొంత సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. జూన్‌లో టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో తొందరపడి సూర్యను ఐపీఎల్‌లో వెంటనే బరిలోకి దించాలని బోర్డు భావించడం లేదు. జనవరిలో సూర్యకు ‘స్పోర్ట్స్ హెర్నియా’ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం అతను జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు.