భారత్‌తో జరిగే రెండు టెస్టుల కోసం 18 మంది సభ్యులతో కూడిన శ్రీలంక జట్టును శ్రీలంక సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టుకు దిముత్ కరుణరత్నే నాయకత్వం వహించనున్నాడు.దాదాపు ఐదు ఏళ్ల తర్వాత భారత్‌లో శ్రీలంకకు ఇది మొదటి టెస్ట్ సిరీస్. 2017లో చివర సారిగా భారత్‌లో శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో తలపడింది. ఇక టెస్ట్ సిరీస్‌కు కూడా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగా దూరమయ్యాడు.
అదే విధంగా సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక సీనియర్ బౌలర్ సురంగ లక్మల్‌కు ఇదే చివరి టెస్ట్ సిరీస్. భారత్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం టెస్టుల నుంచి లక్మల్ తప్పుకోనున్నాడు. ఇక శ్రీలంకతో టెస్ట్‌లకు భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటన చేసింది. కాగా భారత్-శ్రీలంక తొలి టెస్ట్ మోహాలి వేదికగా మార్చి 4నుంచి ప్రారంభం కానుంది.
శ్రీలంక టెస్టు జట్టు: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, లహిరు తిరిమన్నె, ధనంజయ డి సిల్వా (వైస్ కెప్టెన్), కుసాల్ మెండిస్ ), ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వెల్లా, చమిక కరుణరత్నే, రమేష్ మెండిస్, లాహిరు కుమార, సురంగ లక్మల్, దుష్మంత చమీర, విశ్వ ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్దేనియా
చదవండి: Rohit Sharma: టీమిండియా సరికొత్త చరిత్ర.. తొలి కెప్టెన్‌గా రోహిత్!
Comments
Please login to add a commentAdd a comment