రెండు మ్యాచ్‌ల టెస్ట సిరీస్‌లో భాగంగా సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక 328 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ధనంజయ డిసిల్వ (102, 108), కమిందు మెండిస్ (102, 164) రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాది శ్రీలంకను గెలిపించారు. వీరికి బౌలర్లు కసున్ రజిత (3/31, 5/56), విశ్వ ఫెర్నాండో (4/48, 3/36), లహిరు కుమార (3/31, 2/39) తోడవ్వడంతో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ధనంజయ డిసిల్వ, కమిందు మెండిస్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో ఖలీద్ అహ్మద్, నహిద్ రాణా తలో 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లాం, తైజుల్ ఇస్లాం చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లంక బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తైజుల్ ఇస్లాం (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 92 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. డిసిల్వ, మెండిస్ మరోసారి శతక్కొట్టడంతో 418 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మీరజ్ 4, నహిద్ రాణా, తైజుల్ ఇస్లాం చెరో 2, షోరీఫుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శనను పునరావృతం చేసి 182 పరుగులకే చాపచుట్టేసింది. తద్వారా శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లా సెకెండ్ ఇన్నింగ్స్‌లో మొమినుల్ హక్ (87 నాటౌట్) చివరి వరకు ఒంటి పోరాటం చేశాడు. రెండో టెస్ట్ మార్చి 39 నుంచి ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment