అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు ముగ్గురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను ఉపుల్ తరంగా నేతృత్వంలోని శ్రీలంక సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ లాహిరు ఉదరా, ఫాస్ట్ బౌలర్లు చమిక గుణశేఖర, మిలన్ రత్నాయకేలకు తొలిసారి శ్రీలంక టెస్టు జట్టులో చోటు దక్కింది.
ఇక ఈ ఏకైక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక జట్టుకు ధనంజయ డి సిల్వా సారథ్యం వహించనున్నాడు. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శన తర్వాత శ్రీలంకకు ఇదే తొలి టెస్టు మ్యాచ్.
ఫిబ్రవరి 2 నుంచి కొలంబో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు అఫ్గానిస్తాన్ ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌కు అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా దూరమయ్యాడు.
అఫ్గానిస్తాన్ జట్టు:
ఇబ్రహీం జద్రాన్, అబ్దుల్ మాలిక్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), నాసిర్ జమాల్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), మహ్మద్ ఇషాక్, బహీర్ షా, మహ్మద్ సలీమ్ సఫీ, నవీద్ జద్రాన్, కైస్ అహ్మద్, నిజత్ మసూద్, జహీర్ ఖాన్, జియా-ఉర్- రెహ్మాన్, యామిన్ అహ్మద్జాయ్, నూర్ అలీ జద్రాన్
శ్రీలంక జట్టు:
ధనంజయ డి సిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమాల్, సదీర సమరవిక్రమ, రమేష్ మెండిస్, అసిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత, కమిందు మెండిస్, ప్రబాత్ ఉ జయసూర్య, ప్రబాత్ జయసూర్య గుణశేఖర, మిలన్ రాత్నాయకే
Comments
Please login to add a commentAdd a comment