
Sri Lanka tour of Bangladesh- 2022: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు శ్రీలంక జట్టును ప్రకటించింది. ఇందుకు సంబంధించి 18 సభ్యుల పేర్లు వెల్లడించింది. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా శ్రీలంక రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది.
ఈ నేపథ్యంలో దిముత్ కరుణరత్నే సారథ్యంలోని లంక జట్టు మే 8న పర్యాటక దేశానికి చేరుకోనుంది. మే 11 ప్రాక్టీసు మ్యాచ్‌తో ఆటను ఆరంభించనుంది. కాగా ఈ సిరీస్‌తో ఒషాడా ఫెర్నాండో తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. దేశవాళీ టోర్నీ నేషనల్ సూపర్ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకోవడంతో సెలక్టర్లు అతడికి అవకాశం ఇచ్చారు.
శ్రీలంక బంగ్లాదేశ్ పర్యటన-2022: 18 సభ్యులతో కూడిన జట్టు ఇదే
దిముత్ కరుణరత్నె(కెప్టెన్), కమిల్ మిషారా, ఒషాడో ఫెర్నాండో, ఏంజెలో మాథ్యూస్, కుశాల్ మెండిస్, ధనుంజయ డి సిల్వా, కమిందు మెండిస్, నిరోషన్ డిక్‌విల్లా, దినేశ్ చండిమాల్, సుమిందా లఖణ్, కసున్ రజిత, విశ్వ ఫెర్నాండో, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుషనక, ప్రవీణ్ జయవిక్రమ, లసిత్ ఎంబుల్డనియా, రమేశ్ మెండిస్, చమిక కరుణరత్న.
బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక షెడ్యూల్:
మే 11, 12: ప్రాక్టీసు మ్యాచ్- ఛట్టోగ్రామ్‌లో
మే 15- 19: మొదటి టెస్టు- ఛట్టోగ్రామ్‌లో
మే 23- 27: రెండో టెస్టు- ఢాకాలో
Comments
Please login to add a commentAdd a comment