BGT 2023, India Vs Australia, 3rd Test: Steve Smith Pulls Off One-Handed Stunner To Dismiss Cheteshwar Pujara, Video Viral - Sakshi
Sakshi News home page

IND vs AUS: ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే! వీడియో వైరల్‌

Published Fri, Mar 3 2023 9:26 AM | Last Updated on Fri, Mar 3 2023 11:17 AM

Steve Smith Pulls Off One Handed Stunner To Dismiss to Pujara - Sakshi

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అద్భుతమైన ‍కమ్‌బ్యాక్‌ ఇచ్చింది. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా నిరాశపరిచిన ఆసీస్‌.. ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మాత్రం టీమిండియాపై పూర్తి అధిపత్యం చెలాయించింది.

ఈ ఏడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తమ తొలి విజయానికి ఆసీస్‌ 76 పరుగుల దూరంలో మాత్రమే నిలిచింది. ఆస్ట్రేలియా స్నిన్నర్‌  నాథన్‌ లియోన్‌ దాటికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో ఆసీస్ ముందు కేవలం 76 పరుగుల లక్ష్యాన్నే మాత్రమే టీమిండియా నిర్దేశించింది. ఛతేశ్వర్ పూజారా(59) మినహా మిగితా బ్యాటర్లంతా  దారుణంగా విఫలమయ్యారు.

స్మిత్‌ సూపర్‌ క్యాచ్‌...
ఇక ఇండోర్‌ టెస్టు భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. స్మిత్‌ అద్భుతమైన క్యాచ్‌తో భారత బ్యాటర్‌ ఛతేశ్వర్ పుజారాను పెవిలియన్‌కు పంపాడు. భారత ఇన్నింగ్స్‌ 57 ఓవర్‌లో లియాన్‌ వేసిన మూడో బంతిని  పుజారా ఫైన్ లెగ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు.

అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుని లెగ్‌ స్లిప్‌ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌.. డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. స్మిత్‌ అందుకున్న క్యాచ్‌ను చూసి పుజారా కూడా ఆశ్చర్యపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండిIND vs AUS: అతడిని టీమిండియా చాలా మిస్‌ అవుతోంది.. లేదంటే ఆసీస్‌కు చుక్కలే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement