లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో రనౌటైన విధానం తీవ్ర వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. ఆస్ట్రేలియన్లు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారని, గెలుపు కోసం ఏదైనా చేస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టుపై ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లతో పాటు భారత లెజండరీ క్రికెటర్‌లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ సైతం మండిపడ్డారు.
అదే విధంగా ఇంగ్లండ్ మీడియా కూడా ఆస్ట్రేలియా జట్టుపై ఛీటర్స్ అంటూ వరుస కథనాలు ప్రచురించింది. అయితే ఈసారి ఆస్ట్రేలియా మీడియా వంతు వచ్చింది. ఆస్ట్రేలియా మీడియా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను దారుణంగా అవమానపరిచింది. ‘ద వెస్ట్ ఆస్ట్రేలియన్’ అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది.
ఓ పసిబాలుడు నోటిలో పాలపీకాను పట్టుకుని.. ఓ వైపు యాషెస్ ట్రోఫిని, బంతిని పడేసినట్లు ఉన్న ఫోటోను ప్రచురించింది. ఆ పసిబాలుడు ముఖాన్ని స్టోక్స్‌గా మార్ఫింగ్ చేసింది. ఇక ఇందుకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ పోస్టుపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందించాడు. "కచ్చితంగా అది నేను కాదు.. నేనెప్పుడు కొత్త బాల్ తో బౌలింగ్ చేశాను’ అంటూ స్టోక్స్ కౌంటరిచ్చాడు. కాగా రెండో టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికీ స్టోక్స్ మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. జట్టును గెలిపించేందుకు ప్రయత్నించిన స్టోక్స్.. చివరిలో ఔట్ కావడంతో ఓటమిని చవి చూసింది.
ఓవరాల్‌గా 214 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ 155 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య యాషెస్ మూడో టెస్టు జూలై 6 నుంచి లీడ్స్ వేదికగా ప్రారంభం కానుంది. సిరీస్ రేసులో నిలవాలంటే మూడో టెస్టులో ఇంగ్లండ్ కచ్చితంగా విజయం సాధించాలి.
చదవండి: IND Vs WI 2023: టీమిండియాతో వరుస సిరీస్‌లు.. వెస్టిండీస్ క్రికెట్ కీలక నిర్ణయం!
That’s definitely not me, since when did I bowl with the new ball https://t.co/24wI5GzohD
— Ben Stokes (@benstokes38) July 3, 2023
Comments
Please login to add a commentAdd a comment