ముంబై ఇండియన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మిస్టర్‌ 360 వచ్చేశాడు | Suryakumar Yadav arrives with 360 degree shots for wounded Mumbai Indians | Sakshi
Sakshi News home page

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మిస్టర్‌ 360 వచ్చేశాడు

Published Fri, Apr 5 2024 6:12 PM | Last Updated on Fri, Apr 5 2024 7:09 PM

Suryakumar Yadav arrives with 360 degree shots for wounded Mumbai Indians - Sakshi

ఐపీఎల్‌-2024లో వరుస ఓటములతో సతమతవుతున్న ముంబై ఇండియన్స్‌కు ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. ఎట్టకేలకు నేషనల్ క్రికెట్ అకాడమీ మిస్టర్‌ 360 క్లియరన్స్‌ సర్టిఫికేట్‌ పొ​ందాడు. 

ఈ క్రమంలో సూర్య కుమార్‌ ముంబై జట్టుతో కలిశాడు. ముంబై జట్టులో చేరిన సూర్యకుమార్‌ యాదవ్‌.. ప్రాక్టీస్‌ కూడా మొదలెట్టేశాడు. నెట్స్‌లో సూర్య తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లు ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముంబై జట్టు సెలక్షన్‌కు సూర్య అందుబాటులో ఉండే ఛాన్స్‌ ఉంది. సూర్య రాకతోనైనా ముంబై తలరాత మారుతుందో లేదో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement