
ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లోనే సూర్య సెంచరీ సాధించాడు. కివీస్ బౌలర్లకు సూర్య చుక్కలు చూపించాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఇక ఓవరాల్‌గా 51 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అయితే ఈ మ్యాచ్ కేవలం అమెజాన్ ప్రైమ్‌లోనే ప్రసారం కావడంతో చాలా మంది సూర్య ఇన్నింగ్స్‌ను మిస్సయ్యారు. ఈ క్రమంలో సూర్య తుపాన్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోను అమెజాన్ ప్రైమ్, బిటీ స్పోర్ట్ తమ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశాయి.
ఎవరైనా సూర్య ఇన్నింగ్స్‌ను మిస్స్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కివీస్‌పై భారత్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ సిరీస్‌లో ఆఖరి టీ20 నేపియర్ వేదికగా మంగళవారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment