T20 WC 2022: Netherlands Shocks South Africa, Beat By 13 Runs - Sakshi
Sakshi News home page

టీ20 ప్రపంచ కప్‌లో పెను సంచలనం.. దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం

Published Sun, Nov 6 2022 8:55 AM | Last Updated on Sun, Nov 6 2022 9:20 AM

T20 WC 2022: Netherlands Shocks South Africa, Beat By 13 Runs - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం నమోదైంది. హాట్‌ ఫేవరెట్లలో ఒకటైన దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇవాళ (నవంబర్‌ 6) జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్‌ జట్టు పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో చిత్తుగా ఓడి ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది. ఫలితంగా టీమిండియా జింబాబ్వే మ్యాచ్‌తో సంబంధం లేకుంగా సెమీస్‌కు చేరుకుంది. ఈ గ్రూప్‌ రెండో సెమీస్‌ బెర్త్‌.. ఇదే వేదికపై తదుపరి జరిగే బంగ్లాదేశ్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌-2 నుంచి రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.

నెదర్లాండ్స్‌తో జరిగిన అత్యంత కీలకమైన దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. స్టెఫాన్‌ మైబుర్గ్‌ (37), మ్యాక్స్‌ ఓడౌడ్‌ (29), టామ్‌ కూపర్‌ (35), కొలిన్‌ ఆకెర్‌మన్‌ (41 నాటౌట్‌) ఓ మోస్తరుగా రాణించడంతో నెదర్లాండ్స్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. అన్రిచ్‌ నోర్జే, ఎయిడెన్‌ మార్క్రమ్‌లకు తలో వికెట్‌ దక్కింది. 

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడ్డ సౌతాఫ్రికా.. అనూహ్యంగా నెదర్లాండ్స్‌ బౌలర్ల ఉచ్చులో చిక్కుకుని ఘోర ఓటమిని మూటగట్టుకుంది. డచ్‌ బౌలర్లు బ్రాండన్‌ గ్లోవర్‌ 3, బాస్‌ డి లీడ్‌, ఫ్రెడ్‌ క్లాస్సెన్‌ తలో 2 వికెట్లు, పాల్‌ వాన్‌ మీకెరెన్‌ ఓ వికెట్‌ పడగొట్టడంతో దక్షిణాఫ్రికా.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమై 13 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీ బ్యాటర్లలో రిలీ రొస్సో (25) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement