టీ20 వరల్డ్‌కప్-2022లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దైంది. సూపర్-12 గ్రూప్-1లో భాగంగా న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్ 26) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్ల అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
ముఖ్యంగా న్యూజిలాండ్ ఆటగాళ్ల బాధ వర్ణణాతీతంగా ఉంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి జోరుమీదున్న విలియమ్సన్ సేన.. మ్యాచ్ వర్షార్పణం కావడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఈ ప్రభావం సెమీస్ చేరే అవకాశాలను దెబ్బ తీస్తుందని ఆ జట్టు భయపడుతుంది.
మరోవైపు తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ మ్యాచ్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి సంచలనం నమోదు చేయాలని నబీ సేన భావించింది. అయితే వారి ఆశలపై కూడా వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లు చెరో పాయింట్‌తో సర్దుకున్నాయి.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్ గ్రూప-2లో భాగంగా సౌతాఫ్రికా-జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇలాగే ఫలితం తేలకుండా రద్దైంది. అయితే ఆ మ్యాచ్ కొద్ది ఓవర్ల పాటు సాగింది. మరో ఓవర్ ఆట సాధ్యపడి ఉండే ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచేది. ఇక, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 5 పరుగుల తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది.
చదవండి: IRE Vs ENG: టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ‘షాకిచ్చిన పసికూన’
Comments
Please login to add a commentAdd a comment