‘‘అచ్చం నువ్వు ఎలాగైతే జీవితంలో ముందుకు సాగుతావో.. అలాగే ఈ ఫొటోకు కూడా ఎలాంటి మెరుగులు అక్కర్లేదు. ఉక్కు సంకల్పం.. నిజాయితీతో కూడినది నీ వ్యక్తిత్వం. చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా లెక్క చేయక ముందుకు వెళ్లే ధైర్యం నీ సొంతం. నీలా చీకటి నుంచి అత్యున్నత శిఖరాలకు చేరగల వ్యక్తి మరొకరు ఉండరని నాకు తెలుసు. నీ మనసులో భయానికి తావులేదు. రోజురోజుకీ నువ్వు ఎదుగుతున్న విధానం అమోఘం.
మనిద్దరం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకునేంత తీరిక లేదని నాకు తెలుసు. అయితే, కొన్నిసార్లు నాకు బిగ్గరగా అరిచి చెప్పాలనిపిస్తుంది... నీ అంతటి అత్యద్భుత వ్యక్తి మరొకరు లేరని ఈ ప్రపంచానికి చాటిచెప్పాలని ఉంటుంది. నువ్వంటే ఏమిటో తెలిసిన వాళ్లకు ఈ మాటలతో పనిలేదు. జీవితంలో ప్రతి విషయాన్ని ప్రకాశవంతంగా.. మరింత అందంగా తీర్చిదిద్దుతున్నందుకు థాంక్యూ. హ్యాపీ బర్త్‌డే క్యూట్‌నెస్’’.. ఒక భార్యకు భర్తపై ఉన్న ప్రేమను.. ముఖ్యంగా నమ్మకాన్ని చాటుకునేందుకు ఇంతకంటే ఎక్కువ మాటలు అవసరం లేదేమో!
అవును.. సుఖ దుఃఖాల్లో... కష్టాల్లో.. సంతోషాల్లో.. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనలో జీవిత భాగస్వామికి అండగా నిలవడం ప్రేమానురాగాలతో కూడిన దాంపత్యంలో సహజం. అలాంటి అన్యోన్య జంటల్లో విరుష్క జోడి కూడా ఒకటి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతుల గురించే ఈ ప్రస్తావన. నవంబరు 5న కోహ్లి 33వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి సతీమణి అనుష్క శర్మ ఇన్‌స్టా వేదికగా అద్బుతమైన ఫొటో షేర్ చేసి.. భర్తకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సాధారణ కుటుంబం నుంచి వచ్చి... ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన, సంపన్న బోర్డుకు చెందిన క్రికెట్ జట్టుకు సారథిగా ఎదిగిన తీరును వివరిస్తూ భావోద్వేగ క్యాప్షన్ జతచేశారు. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ఆరంభంలో ఎదురైన చేదు అనుభవాలకు వెరవక.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన విధానాన్ని గుర్తుచేసేలా కోహ్లి వ్యక్తిత్వాన్ని తన మాటల్లో ఆవిష్కరించారు.
అలా మొదలై...
ఓ వాణిజ్య ప్రకటన సందర్బంగా పరిచయమైన అనుష్క-విరాట్‌లు ప్రేమలో పడ్డారు. సుదీర్ఘకాలం పాటు ప్రణయంలో మునిగితేలిన ఈ జంట.. 2017లో వివాహ బంధంతో ఒక్కటైంది. డిసెంబరు 11న ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. ఈ అందమైన జంటకు 2021, జనవరి 11న కూతురు వామికా జన్మించింది. అనుష్క నటిగా, నిర్మాతగా రాణిస్తుండగా.. కోహ్లి భారత జట్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీతో బిజీగా ఉన్నాడు.
చదవండి: Virat Kohli: 50 ఏళ్లలో కోహ్లి చెత్త రికార్డు.. పాపం లక్ లేదు: ఆకాశ్ చోప్రా
Comments
Please login to add a commentAdd a comment