Babar Azam Mother Was On Ventilator During India Pakistan Match: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా టీమిండియాతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తీవ్ర ఆవేదనలో ఉన్నాడని అతని తండ్రి ఆజమ్ సిద్ధిఖీ తాజాగా వెల్లడించాడు. భారత్‌తో మ్యాచ్ సమయంలో బాబర్ తల్లి వెంటిలేటర్‌పై ఉందని ఆజమ్ సిద్ధిఖీ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. ప్రపంచకప్‌కు కొద్ది రోజుల ముందు బాబర్ తల్లికి శస్త్రచికిత్స జరిగిందని, ఈ విషయం బాబర్‌కు కూడా తెలుసని, ఆ బాధలోనే అతను ప్రపంచకప్ బరిలోకి దిగాడని పేర్కొన్నాడు.
క్లిష్ట సమయంలో భార్యను బెడ్‌పై వదిలి వచ్చేందుకు తన మనసు అంగీకరించనప్పటికీ.. బాబర్ బలహీనపడకూడదని మ్యాచ్ చూసేందుకు వచ్చానని కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ పేర్కొన్నాడు. బాబర్ గడిచిన మూడు మ్యాచ్‌లు తీవ్రమైన బాధతో ఆడాడని.. ఈ విషయం అభిమానులకు తెలియాలని వెల్లడిస్తున్నాని తెలిపాడు. కాగా, టీ20 ప్రపంచకప్‌లో గత ఆదివారం(అక్టోబర్ 24) పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. పాక్ తమ తదుపరి మ్యాచ్‌లో నమీబియాతో తలపడాల్సి ఉంది.
చదవండి: పాక్‌తో ఓడిపోవడం బాధ కలిగించింది.. అందుకే రిటైర్మెంట్
Comments
Please login to add a commentAdd a comment