పాకిస్తాన్ ఆటగాళ్ల సెల్ఫీ(PC: PCB)
T20 World Cup 2021 Babar Azam To His Teammates After Win Against India: ‘‘చూడండి సోదరులారా... ఇది ఓ ఒక్కరి వల్లనో సాధ్యం కాలేదు. జట్టు సమిష్టి విజయం ఇది. ఈ గెలుపును ఆస్వాదించండి. అయితే... ఇది ఆరంభం మాత్రమేనన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అతి విశ్వాసం వద్దు. ముందున్న మ్యాచ్‌లపై దృష్టి పెట్టాలి. మనందరి లక్ష్యం ఒకటే.. ప్రపంచకప్ గెలవడమే టార్గెట్. ఇప్పుడు గెలిచాం కదా అని పూర్తిగా రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. బ్యాటర్లుగా, బౌలర్లుగా, ఫీల్డర్లుగా వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టాలి.
మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా... అతి విశ్వాసం మాత్రం వద్దే వద్దు.. పదే పదే ఈ విషయం ఎందుకు చెబుతున్నా అంటే... నిలకడలేమితో సతమతమవడం మనకు అలవాటుగా మారింది. ఈ అపవాదును మనం చెరిపేసుకోవాలి. ఇక ఈరోజు మాత్రం జట్టుగా మనం సాధించిన విజయం ఎప్పటికీ మర్చిపోలేం. వెల్‌డన్’’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన బృందాన్ని ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు.
ప్రపంచకప్‌లో భారత్‌పై చారిత్రాత్మక విజయం నమోదు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై మార్గనిర్దేశనం చేశాడు. అదే సమయంలో ఆత్మవిశ్వాసం మాత్రమే ఉండాలని.. అతి విశ్వాసం ఉంటే తదుపరి మ్యాచ్‌లో పతనం ఖాయమంటూ హెచ్చరించాడు.
కాగా సుదీర్ఘ నిరీక్షణ అనంతరం బాబర్ ఆజం సేన ఆదివారం అద్భుతం చేసిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్‌లో ఎన్నడూ లేనివిధంగా భారత్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజం(68), ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(79) చివరి వరకు అజేయంగా నిలిచి పాకిస్తాన్‌కు చారిత్రక విజయం అందించారు. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్‌రూంలో తమ ఆటగాళ్లను ఉద్దేశించి బాబర్ ఆజం ఈ మేరకు ప్రసంగించాడు.
స్కోర్లు:
ఇండియా- 151/7 (20)
పాకిస్తాన్- 152/0 (17.5)
చదవండి: T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్ ఏంటి?’
The captain and head coach address the players after Pakistan's historic win over India. #WeHaveWeWill pic.twitter.com/Laww5iTMzX
— Pakistan Cricket (@TheRealPCB) October 24, 2021
Comments
Please login to add a commentAdd a comment