
పాక్ ఆటగాళ్లకు అభినందనలు.. క్రీడాస్ఫూర్తి చాటుకున్న ధోని, కోహ్లి
Kohli- Dhoni Great Gesture Photo Highlights: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌లో కోహ్లి సేన అనూహ్యంగా ఓటమి పాలైంది.
టాస్ ఓడిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 151 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం చెలరేగడంతో అలవోకగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తద్వారా ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేయగలిగింది.
ఇదిలా ఉంటే.. మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి... మెంటార్ ధోని వ్యవహరించిన తీరు.. క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది.
మ్యాచ్ పూర్తైన అనంతరం కోహ్లి... పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను చిరునవ్వుతో అభినందించాడు.
ఇక మెంటార్ ధోని సైతం పలువురు పాక్ ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించడం విశేషం.
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.