Inzamam-ul-Haq Comments On Team India Loss: ‘‘ఇండియా- పాకిస్తాన్ తర్వాత ఈ టోర్నమెంట్‌లో ఇదే పెద్ద మ్యాచ్. ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య పోరు కన్నా ఆసక్తికరం. కానీ... ఇంతటి ప్రాముఖ్యం గల మ్యాచ్‌లో టీమిండియా ఆడిన విధానం నన్ను విస్మయానికి గురిచేసింది. అసలు వాళ్లు ఏం చేశారో అర్థం కాలేదు.
అంత పెద్ద జట్టు.. ఇంతలా ఒత్తిడికి గురవడమేమిటో నాకస్సలు అర్థం కావడం లేదు’’ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. న్యూజిలాండ్ చేతిలో కోహ్లి సేన ఓటమి తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నాడు.
కాగా సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 31 నాటి మ్యాచ్‌లో కివీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా కనీసస్థాయి ప్రదర్శన కనబరచకలేక ఒత్తిడిలో చిత్తయింది.
ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఇంజమామ్... భారత జట్టు ప్రదర్శనపై పెదవి విరిచాడు. ‘‘న్యూజిలాండ్ స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేయగలరు. కానీ వరల్డ్ క్లాస్ మాత్రం కాదు. కానీ... టీమిండియా బ్యాటర్లు మాత్రం వారి బౌలింగ్‌లో సింగిల్స్ కూడా తీయలేకపోయారు.
స్పిన్ బౌలింగ్‌లో చక్కగా ఆడటమే కోహ్లి బలం. తను కూడా సింగిల్స్ కూడా తీయలేకపోవడం దారుణం’’ అని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ కకావికలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి.. (17 బంతుల్లో 9 పరుగులు) పూర్తిగా నిరాశపరిచాడు. ఇక టీమిండియా పరిస్థితి ఇలా ఉంటే... పాకిస్తాన్ వరుసగా టీమిండియా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్‌పై విజయాలతో సెమీస్ బెర్తు దాదాపు ఖరారు చేసుకుంది.
చదవండి: T20 World Cup 2021 Ind Vs NZ: టోర్నీ నుంచి నిష్క్రమించినట్లేనా.. ఇంకా అవకాశం ఉందా?!
Kohli is gone ☝️
— T20 World Cup (@T20WorldCup) October 31, 2021
Trying to up the ante, he attempts a big one against Sodhi but fails.
He is dismissed for 9.#T20WorldCup | #INDvNZ | https://t.co/dJpWyk0E0j pic.twitter.com/PiOAQJGwjz
Comments
Please login to add a commentAdd a comment