Ireland vs Netherlands, 3rd Match, Group A: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా గ్రూపు-ఏలోని ఐర్లాండ్, నెదర్లాండ్స్ జట్లు సోమవారం తలపడుతున్నాయి. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటల(భారత కాలమానం ప్రకారం)కు మ్యాచ్ ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఇక నెదర్లాండ్స్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 4 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించిన కర్టిస్ కాంపర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. గెలుపు పట్ల ఐర్లాండ్ కెప్టెన్ బల్బిర్నీ స్పందిస్తూ.. టాస్ ఓడినా టార్గెట్‌ను ఛేజ్ చేయడం సంతోషంగా ఉందన్నాడు. గరేత్ డిలనీ(44) అద్బుతంగ రాణించాడని ప్రశంసలు కురిపించాడు.
స్కోర్లు: నెదర్లాండ్స్- 106 (20)
ఐర్లాండ్ 107/3 (15.1)
Updates:
► ఏడు వికెట్ల తేడాతో ఐర్లాండ్ విజయం
►10 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ స్కోరు: రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు.
►పాల్ స్టిర్లింగ్(21), గరేత్ డిలనీ(24) క్రీజులో ఉన్నారు. ఐర్లాండ్ విజయానికి 60 బంతుల్లో 37 పరుగులు అవసరం.
►రెండో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్
►కెప్టెన్ బల్బిర్నీ(8) అవుట్
►5 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్ స్కోరు: 36-2
►ఐర్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. బ్రెండన్ గ్లోవర్ బౌలింగ్‌లో కెవిన్ ఓ బ్రెయిన్(9).. వాన్ బీక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఐర్లాండ్ లక్ష్యం: 107
►నిర్ణీత 20 ఓవర్లలో నెదర్లాండ్స్ 106 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ మాక్స్ 51(47 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో) అర్ధ శతకం సాధించగా.. కెప్టెన్ పీటర్ సీలార్(21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. బెన్ కూపర్, లాగాన్ వాన్ బీక్ రనౌట్ అయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జోషువా లిటిల్‌కు ఒకటి, మార్క్ అదేర్‌కు 3, అత్యధికంగా కర్టిస్ కాంపర్‌కు 4 వికెట్లు దక్కాయి.
►నెదర్లాండ్స్ ఓపెనర్ మాక్స్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 45 బంతుల్లో 51 పరుగులు చేసిన అతడు నిలకడగా ఆడుతున్నాడు. మెగా టోర్నీలో తన తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.
►15 ఓవర్లు ముగిసే సరికి నెదర్లాండ్స్ స్కోరు: 80-6.
►టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్... ఐర్లాండ్ బౌలర్ల దాటికి చేతులెత్తేసింది. పది ఓవర్లలోపే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది.
►10 ఓవర్లు ముగిసే సరికి నెదర్లాండ్స్ స్కోరు: 52-6
►5 ఓవర్లు ముగిసే సరికి నెదర్లాండ్స్ స్కోరు: 24-2.
►బెన్ కూపర్(రనౌట్), బాస్ డీ లీడే అవుట్.
►జోషువా లిటిల్‌కు ఒక వికెట్ దక్కింది.
తొలి వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్:
►మొదటి ఓవర్ రెండో బంతికే నెదర్లాండ్స్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ బెన్ కూపర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఐర్లాండ్ బౌలర్ స్టిర్లింగ్ బౌలింగ్‌లో పరుగు తీసేందుకు యత్నించగా... సిమీ సింగ్ అతడిని రనౌట్ చేశాడు. ప్రస్తుతం మాక్స్, బాస్ డీ లీడే క్రీజులో ఉన్నారు.
తుదిజట్లు:
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, కెవిన్ ఒబ్రెయిన్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), గరేత్ డిలనీ, హారీ టెక్టార్, కర్టిస్ కాంపర్, నీల్ రాక్(వికెట్ కీపర్), సిమీ సింగ్, మార్క్ అదేర్, బెంజమిన్ వైట్, జోషువా లిటిల్.
నెదర్లాండ్స్:
మాక్స్ ఆడౌడ్, బెన్ కూపర్, బాస్ డీ లీడే, కొలిన్ ఆకెన్‌మాన్, రియాన్ టెన్ డొచేట్, స్కాట్ ఎడ్వర్డ్స్(వికెట్ కీపర్), రోలోఫ్ వాన్ దెర్ మెర్వీ, పీటర్ సీలార్(కెప్టెన్), లాగన్ వాన్ బీక్, ఫ్రెడ్ క్లసేన్, బ్రెండన్ గ్లోవర్.
Comments
Please login to add a commentAdd a comment