Rohit Sharma Dropped By Adam Milne.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఇషాన్ కిషన్ ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ ఆడిన తొలి బంతినే థర్డ్‌మన్ దిశగా గాల్లోకి లేపాడు. అయితే అక్కడే ఉన్న ఆడమ్ మిల్నే చేతిలోకి నేరుగా బంతి వెళ్లింది. కానీ మిల్నే క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో రోహిత్ శర్మ బతికిపోయాడు. ఈ నేపథ్యంలో గ్యాలరీ నుంచి మ్యాచ్ వీక్షిస్తున్న రోహిత్ శర్మ భార్య రితికా శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. బంతి వెళ్లి మిల్నే చేతిలో పడగానే.. రితికా నోరు తెరిచి తల పట్టుకుంది.. అయితే క్యాచ్ జారవిడవడంతో రితికా తన గుండెల మీద చెయ్యి వేసుకొని బతుకుజీవుడా అంటూ రియాక్షన్ ఇచ్చింది.
చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ రోజు బాబర్ ఆజమ్ తీవ్ర ఆవేదనలో ఉన్నాడు..!
Comments
Please login to add a commentAdd a comment