
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ (జూన్ 13) మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. కింగ్స్‌టౌన్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ తలపడనుండగా.. ట్రినిడాడ్ వేదికగా జరిగే రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్-పపువా న్యూ గినియా.. ఆంటిగ్వా వేదికగా జరిగే మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్-ఒమన్ జట్లు పోటీపడనున్నాయి.
గ్రూప్-డిలో భాగంగా బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుండగా.. గ్రూప్-సిలో జరిగే ఆఫ్ఘనిస్తాన్-పపువా న్యూ గినియా మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు.. గ్రూప్-బిలో భాగంగా జరిగే ఇంగ్లండ్-ఒమన్ మ్యాచ్ ఇవాళ మధ్య రాత్రి 12:30 గంటలకు ప్రారంభమవుతాయి.
నెదర్లాండ్స్‌ను బంగ్లాదేశ్ ఓడిస్తే..
గ్రూప్-డిలో భాగంగా ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై విజయం సాధిస్తే బంగ్లాదేశ్ సూపర్-8 అవకాశాలు భారీగా మెరుగుపడతాయి. ప్రస్తుతం ఇరు జట్ల ఖాతాలో చెరి 2 పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ తదుపరి నెదర్లాండ్స్ శ్రీలంకతో.. బంగ్లాదేశ్ నేపాల్‌తో తలపడాల్సి ఉంది.
కివీస్ ఇంటికే..
పపువా న్యూ గినియాతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే.. గ్రూప్-సిలో చివరి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. పీఎన్‌జీపై విజయం సాధిస్తే.. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ (4 పాయింట్లు) వెస్టిండీస్‌ను (6 పాయింట్లు) కిందికి దించి టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది. కివీస్ తదుపరి ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా 4 పాయింట్లు మాత్రమే వస్తాయి.
Feel for Kane Williamson. 💔 pic.twitter.com/9GoiXnNlZF
— Tanuj Singh (@ImTanujSingh) June 13, 2024
ఇంగ్లండ్‌కు చాలా కీలకం
ఒమన్‌తో ఇవాళ జరుగబోయే మ్యాచ్ ఇంగ్లండ్‌కు చాలా కీలకంగా కానుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ఆ జట్టు సూపర్-8 రేసులో ఉంటుంది. ప్రస్తుతం ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో ఓడి, మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇంగ్లండ్ ఖాతాలో కేవలం ఒకే ఒక పాయింట్ ఉంది. గ్రూప్-బి నుంచి రెండో స్థానంలో ఉన్న స్కాట్లాండ్ 5 పాయింట్లతో సూపర్-8 రేసులో ముందుంది. ఈ గ్రూప్ నుంచి ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలిచిన ఆస్ట్రేలియా ఇదివరకే సూపర్-8కు క్వాలిఫై అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment