టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇవాల్టి నుంచి (జూన్ 19) సూపర్-8 మ్యాచ్‌లు మొదలవుతున్నాయి. ఇవాళ జరిగే మొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా, యూఎస్‌ఏ తలపడనున్నాయి. ఆంటిగ్వా వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా, యూఎస్‌ఏ చెరో మార్పు చేశాయి. సౌతాఫ్రికాకు సంబంధించి పేసర్ ఓట్నీల్ బార్ట్‌మన్ స్థానంలో కేశవ్ మహారాజ్ తుది జట్టులోకి రాగా.. యూఎస్‌ఏకి సంబంధించి లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ నోష్తుష్ కెంజిగే తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు..
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్), రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ
యునైటెడ్ స్టేట్స్: షాయన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(వికెట్‌కీపర్), ఆరోన్ జోన్స్(కెప్టెన్), నితీష్ కుమార్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నోష్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్
Comments
Please login to add a commentAdd a comment