‘థౌజండ్‌’వాలాలో ముంబై మిలమిల | Tim David hits three sixes in a row to power Mumbai Indians to victory | Sakshi
Sakshi News home page

‘థౌజండ్‌’వాలాలో ముంబై మిలమిల

Published Mon, May 1 2023 1:26 AM | Last Updated on Mon, May 1 2023 1:27 AM

Tim David hits three sixes in a row to power Mumbai Indians to victory - Sakshi

ముంబై: ఐపీఎల్‌ ‘థౌజండ్‌’ వాలా (1000వ మ్యాచ్‌)లో యశస్వి జైస్వాల్‌ విధ్వంసాన్ని ముంబై మెరుపులు ముంచెత్తాయి. దీంతో ముంబై 6 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గెలిచింది. తొలుత రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీస్కోరు చేసింది. యశస్వి జైస్వాల్‌ (62 బంతుల్లో 124; 16 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టాడు. తర్వాత కష్టమైన లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్‌ 3 బంతులు మిగిలుండగానే 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి ఛేదించింది.

గ్రీన్‌ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ (29 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్‌ (14 బంతుల్లో 45 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలకపాత్ర పోషించారు. చివరి ఓవర్లో ముంబై విజయానికి 17 పరుగులు అవసరం కాగా ... హోల్డర్‌ వేసిన ఈ ఓవర్లో తొలి మూడు బంతులను టిమ్‌ డేవిడ్‌ సిక్సర్లుగా మలిచి గెలిపించాడు.  

స్కోరు వివరాలు 
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి అండ్‌ బి) అర్షద్‌ 124; బట్లర్‌ (సి) సబ్‌–రమణ్‌దీప్‌ (బి) చావ్లా 18; సామ్సన్‌ (సి) తిలక్‌ (బి) అర్షద్‌ 14; పడిక్కల్‌ (బి) చావ్లా 2; హోల్డర్‌ (సి) డేవిడ్‌ (బి) ఆర్చర్‌ 11; హెట్‌మైర్‌ (సి) సూర్య (బి) అర్షద్‌ 8; ధ్రువ్‌ (సి) తిలక్‌ (బి) మెరిడిత్‌ 2; అశ్విన్‌ (నాటౌట్‌) 8; బౌల్ట్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–103, 4–143, 5–159, 6–168, 7–205. బౌలింగ్‌: గ్రీన్‌ 3–0–31–0, ఆర్చర్‌ 4–0–35–1, మెరిడిత్‌ 4–0–51–1, చావ్లా 4–0–34–2, కార్తికేయ 2–0–14–0, అర్షద్‌ 3–0–39–3.

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) సందీప్‌ 3; ఇషాన్‌ (సి) బౌల్ట్‌ (బి) అశ్విన్‌ 28; గ్రీన్‌ (సి) బౌల్ట్‌ (బి) అశ్విన్‌ 44; సూర్య (సి) సందీప్‌ (బి) బౌల్ట్‌ 55; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 29; డేవిడ్‌ (నాటౌట్‌) 45; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–14, 2–76, 3–101, 4–152. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–43–1, సందీప్‌ 4–0–35–1, అశ్విన్‌ 4–0– 27–2, చహల్‌ 3–0–32–0, హోల్డర్‌ 3.3–0–55–0, కుల్దీప్‌ సేన్‌ 1–0–20–0.  


ఐపీఎల్‌లో నేడు 
లక్నోVS బెంగళూరు (రాత్రి గం. 7:30 నుంచి) 
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement