IPL 2023: Rajasthan Royals Shimron Hetmyer Comments On Maiden Win Over Gujarat Titans, Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2023: గుజరాత్‌పై రాజస్థాన్‌ గెలుపు.. ప్రతీకారం తీర్చుకున్నామన్న హెట్‌మైర్‌

Published Mon, Apr 17 2023 2:18 PM | Last Updated on Mon, Apr 17 2023 3:15 PM

Today Was Sort Of A Revenge Says Hetmyer On RRs Maiden Win Over GT - Sakshi

Photo Credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (ఏప్రిల్‌ 16) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో గుజరాత్‌పై రాజస్థాన్‌కు ఇది తొట్టతొలి విజయం. ఈ రెండు జట్లు గతంలో (ఐపీఎల్‌ 2022) ఎదురెదురుపడిన మూడు సందర్భాల్లో గుజరాత్‌నే గెలుపు వరించింది. నాలుగో అటెంప్ట్‌లో రాజస్థాన్‌ విజయం సాధించడంతో ఆ జట్టు కీలక సభ్యుడు, కేకేఆర్‌తో మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు విన్నర్‌ షిమ్రోన్‌ హెట్‌మైర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా హెట్‌మైర్‌ మాట్లాడుతూ.. ఎట్టకేలకు తమ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది.. ఈ సందర్భాన్ని వ్యక్తిగతంగా నేను ఆస్వాధిస్తున్నాను.. మాటలు రావడం లేదు.. టైటాన్స్‌పై గెలవడం చాలా కష్టం, ఆ జట్టు నిండా కఠినమైన ఆటగాళ్లు ఉన్నారు, నాలుగో ప్రయత్నంలో మేము సక్సెస్‌ సాధించామని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ బౌల్‌ చేసిన నూర్‌ అహ్మద్‌ను హెట్‌మైర్‌ ప్రశంసించాడు. నూర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని, ఇలాంటి సందర్భాలను ఎదుర్కొనేందుకు నేను ముందుగానే ప్రిపేర్‌ కావడంతో ఆఖరి ఓవర్లో పరుగులు రాబట్టగలిగానని చెప్పుకొచ్చాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (45), మిల్లర్‌ (46) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (26 బంతుల్లో 56 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (32 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో రాజస్థాన్‌ రాయల్స్‌ 7 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి 215.38 స్ట్రయిక్‌ రేట్‌తో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసిన హెట్‌మైర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement