టిక్... టిక్... టిక్... అంటూ ఒలింపిక్స్ ఆటలకు శుక్రవారం జేగంట మోగనుంది. తొలిరోజు ఆరంభోత్సవం... జపాన్ కళలతో, కళాకారులతో అలరించేందుకు ముస్తాబైంది. ఆ తర్వాత రోజు నుంచి పోటీలు... పతకాల పట్టికను అంకెలతో నింపేయనున్నాయి. అయితే ఇది జపాన్‌లో జరగనుండటంతో ముఖ్యంగా భారత టీవీ ప్రేక్షకులకు కనులపంట కానుంది. టీవీల్లో కరోనా కేసులు–న్యూస్‌లతో విసిగెత్తిన పెద్దలు, ఆన్‌లైన్ చదువు బుర్రకెక్కని పిల్లలు, మొబైల్ గేమ్ బోర్ కొట్టిన కుర్రాళ్లు కొత్తగా వెరైటీగా చూడాలనుకుంటే టోక్యో ఒలింపిక్స్ చూడొచ్చు. మన టైమింగ్‌కు సరిపోయే షెడ్యూల్ మనకు భలే వినోదాన్ని అందిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. టోక్యో ఒలింపిక్స్‌ను భారత్‌లో సోనీ నెట్‌వర్క్‌తోపాటు దూరదర్శన్ స్పోర్ట్స్ చానెల్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
– సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment