చెలరేగుతున్న భారత షట్లర్లు.. వరుసగా రెండో స్వర్ణం సొంతం | Tokyo Paralympics: Krishna Nagar Won 5th Gold For India In Mens Singles Badminton | Sakshi
Sakshi News home page

Tokyo Paralympics: చెలరేగుతున్న భారత షట్లర్లు.. వరుసగా రెండో స్వర్ణం సొంతం

Published Sun, Sep 5 2021 10:50 AM | Last Updated on Sun, Sep 5 2021 11:04 AM

Tokyo Paralympics: Krishna Nagar Won 5th Gold For India In Mens Singles Badminton - Sakshi

టోక్యో: పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌ పతకాల పంట పండిస్తుంది. నిన్న ఎస్‌ఎల్‌ 3 విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ పసిడిని ముద్దాడగా.. తాజాగా ఎస్‌హెచ్‌ 6 విభాగంలో కృష్ణ నాగర్‌ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నాగర్‌.. ఫైనల్లో హాంకాంగ్‌ షట్లర్‌ చు మన్‌ కైను 21-17, 16-21, 21-17తేడాతో మట్టికరిపించాడు. ఈ పతకంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 19కి చేరింది. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి.

కాగా, పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ తొలిసారి బ్యాడ్మింటన్‌లో పతకాలను సాధిస్తుంది. ఇందులో ఏకంగా 2 పసిడి(కృష్ణ నాగర్‌, ప్రమోద్‌ భగత్‌), రజతం(సుహాస్ యతిరాజ్), మరో కాంస్య(మనోజ్‌ సర్కార్‌) పతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, పారాలింపిక్స్‌లో భారత్‌ ఈ స్థాయిలో(19) పతకాలు సాధించడం ఇదే తొలిసారి. 2016 రియో పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన 4(2 స్వర్ణం, రజతం, కాంస్యం) పతకాలే ఇప్పటిదాకా అత్యుత్తమం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement