దుబాయ్: రెండేళ్ల క్రితం ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రాజస్తాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ముంబై ఇండియన్ప్‌తో మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు సాధించి శభాష్ అనిపించాడు. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ ఉత్తమ గణాంకాల్ని నమోదు చేశాడు. ఆపై ఇంగ్లండ్ జట్టుకు కీలకంగా మారిన ఈ పేసర్.. ఆ జట్టు తొలిసారి వరల్డ్‌కప్ గెలవడంలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో పాటు వైవిధ్యమైన బంతులు, యార్కర్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న జోఫ్రా ఆర్చర్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌ల్లో కలిపి మూడు వికెట్లు మాత్రమే సాధించాడు. కానీ వేగంలో మాత్రం దడపుట్టిస్తున్నాడు ఆర్చర్. అంతకంతకూ తన వేగాన్ని పెంచుకుంటూ మిగతా జట్లకు సవాల్ విసురుతున్నాడు. (చదవండి: ‘అతనే మా ఆయుధం.. దడ పుట్టిస్తాడు: వార్న్)
ఈ సీజస్‌లో ఇప్పటివరకూ టాప్-20 ఫాస్టెస్ట్ డెలివరీల లిస్టులో ఆర్చర్‌వే 16 ఉన్నాయంటే అతని వేగం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో 150కి.మీ, అంతకంటే వేగంతో వేసిన బంతులు మూడు ఉండగా, 147 కి.మీ వేగంగా కంటే ఎక్కువ వేసినవి మరో 13 బంతులు ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఫాస్టెస్ట్ బంతుల్ని ఎక్కువ వేసిన బౌలర్లలో ఆర్చర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో 150 కి.మీ వేగాన్ని దాటిన బౌలర్ ఆర్చర్ కావడం ఇక్కడ మరో విశేషం. ఇక ఆర్సీబీ పేసర్ నవదీప్ సైనీకి కూడా టాప్-20 ఫాస్టెస్ట్ డెలివరీల లిస్టులో చోటు దక్కింది. ఈ సీజన్‌లో సైనీ వేసిన వేగవంతమైన బంతి 147. 92కి.మీగా నమోదైంది. ఇప్పటివరకూ ఐపీఎల్ ఆడుతున్న భారత ఆటగాళ్లలో సైనీదే వేగవంతమైన బంతి కావడం గమనార్హం. ఇక దక్షిణాఫ్రికా క్రికెటర్ అన్రిచ్ నోర్త్‌జే, ఆసీస్ పేసర్ హజిల్‌వుడ్‌లకు కూడా టాప్-20 ఫాస్టెస్ట్ బాల్స్ లిస్టులో చోటు దక్కింది. నోర్త్‌జే 147.33, 148.92 కి.మీ వేగంతో బంతులు వేయగా, హజిల్‌వుడ్ 147. 32 కి.మీ వేగంతో టాప్-20లో చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment