Under 19 World Cup- Nivethan Radhakrishnan Super Innings: భారత సంతతి కుర్రాడు, ఆస్ట్రేలియా క్రికెటర్ నివేథన్ రాధాకృష్ణన్ అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో అదరగొట్టాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా వెస్టిండీస్ వేదికగా సాగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా యువ జట్టు అఫ్గనిస్తాన్‌తో తలపడింది. శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనర్ మహ్మద్ ఇషాక్(34 పరుగులు), కెప్టెన్ సులేమాన్ సైఫీ 37 పరుగులు, అహ్మద్ అహ్మద్‌జై 81 పరుగులతో రాణించడంతో 10 వికెట్ల నష్టానికి అఫ్గన్ 201 పరుగులు చేసింది. నివేథన్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ కాంప్‌బెల్ కెలావే(51 పరుగులు) అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నివేథన్ రాధాకృష్ణన్ 66 పరుగులు సాధించాడు. ఆ తర్వాత టపాటపా వికెట్లు పడ్డాయి.
అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయం ఎట్టకేలకు ఆసీస్‌నే వరించింది. రెండు వికెట్లు పడగొట్టడం సహా హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించిన నివేథన్ రాధాకృష్ణన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో భాగంగా అఫ్గన్.. ఇంగ్లండ్ చేతిలో ఓడగా... ఆసీస్‌ను భారత్ మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్, భారత్ తుదిపోరుకు అర్హత సాధించగా.. అఫ్గన్- ఆసీస్ మూడో స్థానం కోసం పోటీపడ్డాయి. నివేథన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్ రెండు వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది.
స్కోర్లు:
అఫ్గనిస్తాన్ అండర్-19 201 (49.2 ఓవర్లు)
ఆస్ట్రేలియా అండర్-19 202/8 (49.1 ఓవర్లు)
Comments
Please login to add a commentAdd a comment