ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించడమే తన అంతిమ లక్ష్యమని వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తెలిపాడు. ఇక కార్తీక్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత విజయంలో కార్తీక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే 41 పరుగులు సాధించి మరో సారి ఫినిషర్ అవతారమెత్తాడు. తాజాగా బీసీసీఐ టీవీతో కార్తీక్ మాట్లాడుతూ.. "టీమిండియా అన్ని జట్లు కంటే విభిన్నమైంది. ఇటువంటి జట్టులో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది.
మా జట్టులో ఎప్పుడూ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ క్రెడిట్ మొత్తం కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకే దక్కాలి. ఇక ప్రస్తుత విజయాలు మా శిభరంలో కొత్త ఉత్సహాన్ని నింపుతున్నాయి. అయితే టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడమే నా అంతిమ లక్ష్యం" అని పేర్కొన్నాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్‌లో అదరగొట్టిన కార్తీక్.. మూడేళ్ల తర్వాత తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
చదవండి: జింబాబ్వేలో పర్యటించే టీమిండియా ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment