మొన్న బుమ్రా.. నేడు హాజిల్‌వుడ్‌! ఎవ‌రైతే నాకేంటి? | Vaibhav Suryavanshi smashes Josh Hazlewood to bits | Sakshi
Sakshi News home page

#Vaibhav Suryavanshi: మొన్న బుమ్రా.. నేడు హాజిల్‌వుడ్‌! ఎవ‌రైతే నాకేంటి?

Apr 11 2026 6:13 AM | Updated on Apr 11 2026 10:24 AM

Vaibhav Suryavanshi smashes Josh Hazlewood to bits

ఐపీఎల్‌-2026లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. మొన్న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు చుక్కలు చూపించిన వైభవ్‌.. నేడు ఆర్సీబీతో మ్యాచ్‌లో వరల్డ్ క్లాస్ బౌలర్లు జోష్ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్ కుమార్‌లను ఉతికారేశాడు.

రాజస్తాన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వైభవ్ వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. అనుభవజ్ఞుడైన హాజిల్‌వుడ్‌ను ఒక నెట్ బౌలర్‌లా వైభవ్‌ ఆడుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ కూడా వైభవ్‌ సేమ్ ట్రీట్‌మెంట్ ఇచ్చాడు.

రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 16 పరుగులు రాబట్టాడు. దీంతో ఈ బిహార్ ఆటగాడు కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.  ఓవరాల్‌గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్‌.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్‌ ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. 

ఈ ఏడాది సీజన్‌లో వైభవ్‌ నాలుగు మ్యాచ్‌లు 266.67 స్ట్రైక్‌ రేటుతో 200 పరుగులు చేశాడు. వైభవ్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత డేంజరస్‌ బ్యాటర్‌ వైభవ్‌ అని కొనియాడుతున్నారు.
చదవండి: IPL 2026: ఆర్సీబీ ఓపెనర్‌ చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే

 

Advertisement
 
Advertisement
Advertisement