ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్‌ను రాయల్స్ యాజమాన్యం నియమించింది. వచ్చే ఏడాది సీజన్‌లో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి విక్రమ్ పనిచేయనున్నాడు.
ఇటీవలే రాజస్తాన్ తమ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాథోర్‌ను కూడా తమ ఫ్రాంచైజీలో భాగం చేసింది. కాగా ద్రవిడ్-రాథోర్‌కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ టీ20 వరల్డ్‌కప్-2024 గెలిచిన భారత జట్టు కోచింగ్ స్టాప్‌లో భాగంగా ఉన్నారు.
టీమిండియా హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ సేవలు అందించగా.. అతడి ఆధ్వర్యంలో బ్యాటింగ్ కోచ్‌గా రాథోర్ పనిచేశాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ ఐపీఎల్‌లో అదే కాంబినేషన్‌ను రిపీట్ చేయనున్నారు. రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ యాజమాన్యంకు చెందిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్‌ను జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించిందని రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రకటలో పేర్కొంది.
ద్రవిడ్ కూడా రాథోర్ నియామకాన్ని స్వాగతించాడు. విక్రమ్‌కు అద్బుతమైన బ్యాటింగ్ టెక్నిక్ స్కిల్స్ ఉన్నాయని, అతడి అనుభవం రాయల్స్‌ను విజయం పథంలో నడిపించగలడు అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
చదవండి: మహిళా క్రికెటర్‌తో ‘బంధం’.. శ్రీలంక మాజీ ప్లేయర్‌కు భారీ షాక్!
Comments
Please login to add a commentAdd a comment