రెండోసారి తండ్రైన భజ్జీ.. భావోద్వేగ ట్వీట్‌ | Viral: Harbhajan Singh And Geeta Basra Blessed With Baby Boy | Sakshi
Sakshi News home page

Harbhajan Singh: రెండోసారి తండ్రైన భజ్జీ.. భావోద్వేగ ట్వీట్‌

Published Sat, Jul 10 2021 1:49 PM | Last Updated on Sat, Jul 10 2021 1:52 PM

Viral: Harbhajan Singh And Geeta Basra Blessed With Baby Boy - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ రెండోసారి తండ్రయ్యాడు. భజ్జీ భార్య, నటి గీతా బస్రా శనివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హర్భజన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. భగవంతుడి దయ వల్ల గీతా, బాబు పూర్తి క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నాడు. ‘‘మేం చేయి పట్టుకుని నడిపించేందుకు ఓ చిన్ని చేయి... తన ప్రేమ స్వర్ణం అంతటి విలువైనది.. అద్భుతమైన బహుమతి... మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జీవితాలు పరిపూర్ణమయ్యాయి’’ అంటూ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. 

కాగా 2015, అక్టోబరు 29న పెళ్లి బంధంతో ఒక్కటైన హర్భజన్‌ సింగ్‌- గీతా బస్రా దంపతులకు ఇది వరకు కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కెరీర్‌ విషయానికొస్తే... టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న భజ్జీ.. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగస్వామ్యమైన విషయం తెలిసిందే. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున అతడు మైదానంలో దిగాడు. ఇక గీతా బస్రా... ‘‘దిల్‌ దియా హై’’ సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement